మనం చేసుకునే అబ్బాయి మంచి వాడు అయితే సరిపోదు.ఆ కుటుంబం కుడా మంచిగా ఏ కల్ముషం లేకుండా ఉంటేనే అమ్మాయికి అత్తవారింటిలో ఆనందం .లేకుంటే జీవితం ఎడారిల సాగిపోతుంది .అత్త గారు  కూడా ఒకప్పటి కోడలే అని గుర్తు వుంచుకోవాలి .ఏది ఏమైనా మల్లెపూవు లాంటి మనసు కల లేత అమ్మాయి పెళ్లి తరువాత మంచు ముక్కల గట్టిగా మారుతుంది అనటం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు .ఇలా ఎందుకు అన్నానా అని ఆలోచిస్తునారా ?మరి నిజం కదా ?చెప్పండి?ఎన్నో కలలు మరెన్నో ఆశలతో అడుగు పెట్టిన ఆడపిలను ఒంటరి దానిని చేసి ఆట ఆడుకుంటారు అత్త ఇంటి వారు.ఏ మాయ చేసాడో కాని ఆ దేవుడు అమ్మాయిని పెళ్లి అనే పేరుతో పర్వతాలు ఎక్కిస్తాడు .జలపాతాలు చూపిస్తాడు .